Rashmika Mandanna: గర్ల్ ఫ్రెండ్ కోసం రౌడీ హీరో..
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:47 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. అమ్మడు ఏ సినిమాలో నటించినా అది విజయం వైపే పరుగులు తీస్తుంది.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. అమ్మడు ఏ సినిమాలో నటించినా అది విజయం వైపే పరుగులు తీస్తుంది. ఇండస్ట్రీ మొత్తంలో రష్మికనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఈ మధ్యనే రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend) సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్దిత్ శెట్టి హీరోగా నటించగా అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటించింది. టాక్సిక్ రిలేషన్ లో ఒక అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది అనేది రాహుల్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
ఇక భూమా పాత్రలో రష్మిక నటించిన అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించడం విశేషం. ఈ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ ది గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కువిజయ్ దేవరకొండను పిలుస్తామని చెప్పుకొచ్చాడు. ఈ మధ్యనే రష్మిక - విజయ్ ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెల్సిందే. అయితే ఆ విషయాన్నీ ఇంకా ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. దీంతో నిశ్చితార్థం అయ్యాకా విజయ్ - రష్మిక జంటగా ఎప్పుడు కలుస్తారా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అల్లు అరవింద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విజయ్ ని పిలుస్తాను అనడంతో ఆ వేడుకలోనే తమ ఎంగేజ్ మెంట్ విషయాన్నీ ఈ జంట చెప్తారేమో అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ ఈవెంట్ కు విజయ్ కాదు కదా రష్మిక కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక ఇప్పుడు విజయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోయినా గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ కు రానున్నాడు. రేపు ఈ ఈవెంట్ ను మేకర్స్ చాల గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ వేడుకకు విజయ్ - రష్మిక జంటగా హాజరుకానున్నారు. దీంతో ఈసారి అయినా తమ బంధాన్ని అధికారికం చేస్తారేమో అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. మరి ఈ జంట నిశ్చితార్థం తరువాత మొదటిసారి కెమెరా ముందుకు వస్తున్నారు.. ఎలాంటి స్పీచ్ ఇస్తారో చూడాలి.