Vijay Deverakonda X NTR: తారక్ పిచ్చెక్కించాడు.. విజయ్ దేవరకొండ

ABN , Publish Date - Feb 11 , 2025 | 03:37 PM

కొన్ని ప్లాప్‌ల తర్వాత విజయ్ దేవరకొండ మాస్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తన కొలాబరేషన్ ఎలా ఉందొ చెప్పాడు.

Vijay Deverakonda X NTR: తారక్ పిచ్చెక్కించాడు.. విజయ్ దేవరకొండ
Vijay Deverakonda X NTR

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్‌కు 12వ చిత్రం. VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణ సంస్థతో పాటు, హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేసే సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ చిత్ర టైటిల్, టీజర్ విడుదల కానుంది. అయితే ఈ టీజర్‌కు తమిళ్‌లో సూర్య, హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తుండగా.. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందిస్తున్న విషయం తెలిసిందే.


సోమవారం నాడే ఈ వాయిస్ ఓవర్‌ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ దేవకొండ 'X' వేదిక ద్వారా ఆసక్తికరమైన పోస్టు షేర్ చేశాడు. ‘‘నిన్న చాలాసేపు ఎన్టీఆర్‌ అన్నతోనే ఉన్నా. వ్యక్తిగత జీవితం, సినిమా తదితర అంశాల గురించి మాట్లాడుకున్నాం. నా టీజర్ కు వాయిస్ ఇచ్చి ప్రాణం పోశాడు. టీజర్ బయటకు ఎప్పుడొస్తుందా అని నేను ఉత్కంఠతో ఎదురుచూస్తున్న. తారక్ అన్న మ్యాడ్‌నెస్‌ని మా ప్రపంచానికి అందించినందుకు థ్యాంక్స్.’’అంటూ రాసుకొచ్చాడు. దీంతో దేవరకొండ అభిమానులతో పాటు తారక్ అభిమానులు కూడా మురిసిపోతూ కామెంట్స్ పెడుతున్నారు.


ఈ సినిమాలో విజయ్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. విజయ్‌ దేవరకొండను పవర్‌ఫుల్‌గా చూడనున్నారని ఇటీవల నిర్మాత ఓ ఇంటర్వ్యూలో అన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ (Sithara entertainments) నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Feb 11 , 2025 | 03:43 PM