Vijay Deverakonda: విజయ్ దేవరకొండ.. 'రౌడీ జనార్థన్' అప్డేట్ వచ్చేసింది.
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:46 PM
విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ విషయంలో సస్పెస్ ఇంకా వీడలేదు. డిసెంబర్ 22 రాత్రి ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్టుగా ఓ గ్లింప్స్ ద్వారా నిర్మాత దిల్ రాజు తెలిపారు.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మళ్లీ మాస్ రూట్‌లోకి వచ్చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్ పై తన కొత్త చిత్రాన్ని ప్రకటించినప్పటి నుండి ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా నిర్మాత దిల్ రాజు (Dil Raj) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక పవర్ ఫుల్ వీడియోను విడుదల చేసి, టైటిల్ రివీల్ డేట్ ను అనౌన్స్ చేశారు.
దర్శకుడు రవికిరణ్ కోలా (Ravikiran Kola) (రాజా వారు రాణి గారు ఫేమ్) ఈ వీడియోలో సినిమా మూడ్‌ను పరిచయం చేశారు. 'ఎప్పటి నుంచో ఈ కథ చెప్పాలనుకుంటున్నా. ఒక మనిషి గురించి. నేను ఒక మనిషి కథను వింటూ పెరిగాను. అతను పరిపూర్ణుడు కాదు. కానీ కోపంతో ఉన్నాడు. గాయపడ్డాడు. అచ్చమైన మనిషి. అతని కథ ఖచ్చితంగా చెప్పాల్సిందే' అంటూ దర్శకుడు చెప్పిన డైలాగులు సినిమా తీవ్రతను చాటి చెబుతున్నాయి. వీడియో చివరలో రక్తంతో తడిసిన విజయ్ దేవరకొండ చేతిని చూపించి, సినిమా రా అండ్ రస్టిక్ (Raw & Rustic) యాక్షన్ డ్రామా అని స్పష్టం చేశారు.
ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్ 22న రాత్రి 7.29 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి 'రౌడీ జనార్ధన' (Rowdy Janardhan) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. 'రక్తం నాది.. యుద్ధం నాది..' అంటూ ఇప్పటికే రిలీజ్ అయిన కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేసింది. ఇప్పుడు ఈ డిసెంబర్ 22న అప్ డేట్ తో విజయ్ దేవరకొండ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.