Vijay Deverakonda: బాక్సాఫీస్‌కు తుపాను

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:27 AM

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం కింగ్‌డమ్‌..

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్‌’. సితార ఎంటర్టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ నెల 31న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ఈ సందర్భంగా ఓ యాక్షన్‌ ప్రోమో విడుదల చేసి ‘‘ఇది కేవలం సినిమా కాదు. మేము ప్రేమతో నిర్మించిన గొప్ప ప్రపంచం. త్వరలోనే బాక్సాఫీస్‌ తుపానుకు ఈ చిత్రం నాంది పలుకుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: జోమోన్‌.టి.జాన్‌, సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌.

Updated Date - Jul 08 , 2025 | 04:27 AM