Rayadurgam Police: విజయ్‌ దేవరకొండపై కేసు

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:46 AM

విజయ్‌ దేవరకొండపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవర కొండ మాట్లాడుతూ...

విజయ్‌ దేవరకొండపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవర కొండ మాట్లాడుతూ... పహల్గాం ఉగ్రదాడిని 500ఏళ్ల క్రితం జరిగిన ఆదివాసీ తెగల మఽధ్య ఘర్షణలతో పోల్చారు. దీంతో ఆదివాసీల మనోభావాలు దెబ్బతిన్నాయని ట్రైబుల్‌ కమ్యూనిటీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్‌ అశోక్‌కుమార్‌ నాయక్‌ ఈనెల 17న రాయదుర్గం పోలీసులకు విజయ్‌ దేవరకొండపై ఫిర్యాదు చేశాడు. దీంతో విజయ్‌పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపారు.

-రాయదుర్గం (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 23 , 2025 | 04:48 AM