Vijay Devarakonda: రష్మికకు పబ్లిక్ గా ముద్దిచ్చిన విజయ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 12 , 2025 | 09:37 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ జరుపుకున్న విషయం తెల్సిందే.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ జరుపుకున్న విషయం తెల్సిందే. గీత గోవిందం సినిమాలో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం.. స్నేహంగా మారి.. ప్రేమకు దారితీసి.. పెళ్లి వరకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నా కూడా ఎప్పుడు బయటపడలేదు. ఇద్దరూ కలిసి ఎన్నోసార్లు కెమెరా కంటికి చిక్కారు. ఇంకెన్నో సార్లు లొకేషన్స్ ద్వారా అభిమానులు కనిపెట్టారు. కానీ, తామిద్దరం కేవలం స్నేహితులమే అని చెప్పుకొచ్చారు.
ఇక ఎట్టకేలకు విజయ్- రష్మిక పెళ్లితో ఒక్కటి కానున్నారు. నిశ్చితార్థం ఇరు కుటుంబ వర్గాల మధ్య జరిగింది. కానీ, ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా బయటపెట్టలేదు. ఇక నిశ్చితార్థం తరువాత మొట్ట మొదటిసారి ఈ జంట ది గర్ల్ ఫ్రెడ్ సక్సెస్ మీట్ లో బయట కనిపించారు. రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు విజయ్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
ఇక ఈ ఈవెంట్ కు విజయ్ రావడం రావడమే అందరినీ పలకరిస్తూ వచ్చాడు. చివరగా రష్మికకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఆమె చేతిని ముద్దు పెట్టుకొని తన ప్రేమను తెలియజేశాడు. ఇక దీంతో వీరూ అధికారికంగా తమ ప్రేమను కన్ఫర్మ్ చేసినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి స్టేజిపై ఈ జంట ఎలాంటి స్పీచ్ ఇస్తుందో చూడాలి.