Vijay Devarakonda: కింగ్‌డమ్‌.. మారణహోమ సమయం..

ABN , Publish Date - Jul 07 , 2025 | 08:24 PM

ఒక మనిషి.. కోపంతో నిండిన హృదయం.. చాలా దూరం పెట్టిన ప్రపంచం.. ఇప్పుడు మారణహోమ సమయం..

Kingdom Release Date

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్‌ చిత్రం ‘కింగ్‌డమ్‌’ (IKingdom). గౌతమ్‌ తిన్ననూరి (gowtham thinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమా ఇది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడుచచ కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటించింది.


ఒక మనిషి
కోపంతో నిండిన హృదయం..
చాలా దూరం పెట్టిన ప్రపంచం..
ఇప్పుడు మారణహోమ సమయం..


అంటూ జులై 31న తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో విజయ్‌ దేవరకొండ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ గూఢచారిగా కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుపుకోంటోంది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తొలుత మార్చి నెలలో విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 30కు, మరోస?రి జులై 4కు వెళ్లింది. తాజాగా జులై 31న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - Jul 07 , 2025 | 08:30 PM