Kingdom Trailer: విజయ్ నట విశ్వరూపం.. కింగ్డమ్ ట్రైలర్ అరాచకం
ABN , Publish Date - Jul 26 , 2025 | 10:44 PM
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్.
Kingdom Trailer: హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్ (Kingdom). సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత జూలై 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజయ్ కసి మొత్తం ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ మొత్తాన్ని నింపేశారు. విజయ్ నట విశ్వరూపం చూపించాడు అని చెప్పొచ్చు.
ఇక సినిమాకు ఇంకో హైలైట్ అంటే అనిరుధ్ మ్యూజిక్ అని చెప్పాలి. విజయ్ యాక్షన్.. అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఎంతో హై ఇంటెన్సిటీ తో కూడిన ఎమోషన్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా జైల్లో సీన్స్ కు థియేటర్ లో సీట్ మీద ఒక్కరు కూడా కూర్చోరు అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.