Kingdom: అన్నా అంటేనే ఉన్నా.. అనిరుధ్‌ అద‌ర‌గొట్టాడు

ABN , Publish Date - Jul 16 , 2025 | 08:55 PM

పాట‌ విజయ్ దేవరకొండ కింగ్‌డ‌మ్ నుంచి బుధ‌వారం అన్నా అంటేనే ఉన్నా అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు.

kingdom

హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), భాగ్య‌శ్రీ భోర్సే (Bhagyashri Borse) జంట‌గా జ‌ర్సీఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి (Gowtam Tinnanuri) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కింగ్‌డ‌మ్ (Kingdom). సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్‌, పాట‌లు మూవీపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేశాయి.

అయితే ఇప్ప‌టికే థియేట‌ర్లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం ఇప్ప‌టికే అనేక సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. సీజీ ప‌నులు బ్యాలెన్స్ ఉండ‌డం, కొన్ని స‌న్నివేశాలు రీ షూట్ చేస్తుండ‌డం త‌ద‌నంత‌ర కార‌ణాల వ‌ళ్ల అన్నింటిని పూర్తి చేసి ఈ సినిమాను చివ‌ర‌గా ఈ జూలై చివ‌ర‌లో రిలీజ్‌కు రెడీ చేశారు. ఈనేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు స్టార్ట్ చేసి గురువారం ఈ చిత్రం నుంచి నుంచి సెకండ్ సింగిల్ సాంగ్‌ను విడుదల చేశారు.

అన్నా అంటేనే ఉన్నా అంటూ సాగే అన్నాద‌మ్ముల రిలేష‌న్‌ను తెలియ‌జేసేలా పాట ఉంది.కృష్ణ‌కాంత్ (Krishna Kanth) సాహిత్యం అందించ‌గా స్వాయ సంగీతంలో అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) స్వ‌యంగా ఆల‌పించాడు. ఈ సినిమాలో విజయ్ కు అన్నగా సత్యదేవ్ (Satya Dev) కనిపించాడు. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది అనేది ఈ సాంగ్ లో చూపించారు. చిన్నప్పటి నుంచి చిన్నోడికి అండగా ఉన్న పెద్దోడిని చూపించారు. విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

Updated Date - Jul 16 , 2025 | 09:37 PM