Vijay Devarakonda: రష్మికలో ఆ లక్షణాలు ఉన్నాయా..మీకు ఆమె ఓకేనా?
ABN , Publish Date - May 17 , 2025 | 08:39 PM
విజయ్ దేవరకొండ ‘ఫిలింఫేర్’ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. తదుపరి పెళ్లి, రష్మిక గురించి మాట్లాడారు.
‘కింగ్డమ్’ (kingdom) చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. జులై 4న ఈసినిమా విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ‘ఫిలింఫేర్’ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. తదుపరి పెళ్లి, రష్మిక గురించి మాట్లాడారు. ‘‘రష్మికతో ఇంకా ఎన్నో చిత్రాల్లో యాక్ట్ చేయాలని ఉంది. ఆమె ఎంతో మంచి వ్యక్తి. ప్రస్తుతం జీవిత భాగస్వామి గురించి పెద్దగా ఆలోచించడం లేదు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటా’’ అని వివరించారు. మీ జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో (Rashmika Mandanna) ఉన్నాయా? అని రిపోర్టర్ అడగగా ‘‘మంచి మనసు ఉన్న అమ్మాయి ఎవరైనా ఫర్వాలేదు’’ అని బదులిచ్చారు. ‘
‘లైగర్’ తర్వాత ఎంతో మారానని అన్నారు ‘‘దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో ఎప్పటికైనా సినిమా చేయాలనుకునేవాడిని. ‘లైగర్’తో ఆ కల నెరవేరింది. కథ విన్నప్పుడు అద్భుతంగా అనిపించింది. కాకపోతే అనుకున్న ఫలితం అందుకోలేకపోయాం. మా కాంబోలో హిట్ రాలేదనే బాధ ఉంది. ఆ సినిమా నాకెన్నో పాఠాలు నేర్పింది. నన్నెంతో మార్చింది. నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్‌తో మంచి అనుబంధం ఉంది. వారి విజయాలను నేనూ సెలబ్రేట్ చేసుకుంటా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో నేను నటించా. నన్ను తన లక్కీ స్టార్‌గా అనుకుంటాడు. నాకు తొలి విజయాన్ని అందించిన దర్శకుడు ఆయనే. ఆయనతో వర్క్ చేయడానికి ఎప్పుడూ ముందుంటా’’ అని అన్నారు.