Vijay Antony: రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:31 AM

విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భద్రకాళి’. అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు...

విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భద్రకాళి’. అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా సెప్టెంబర్‌ 5న విడుదలవుతోంది. చిత్రబృందం బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ ‘ఇది నాకు 25వ చిత్రం. న్యూ పొలిటికల్‌ జానర్‌లో వస్తోంది. సామాజిక బాధ్యతతో కూడిన కథతో దర్శకుడు తెరకెక్కించారు. నేటి సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది. గతంలో రాజకీయ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు భిన్నమైన శైలిలో సాగుతుంది’ అని చెప్పారు. అరుణ్‌ ప్రభు మాట్లాడుతూ ‘ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే ఓ విభిన్న కథా చిత్రమిది. సినిమా నేపథ్యానికి తగ్గట్టు అణగారిన వర్గాల తరపున పోరాడే యోధుడి పాత్రలో విజయ్‌ ఆంటోని ఆకట్టుకుంటారు. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’ అని అన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 01:31 AM