VI Anand: ఇద్దరు హీరోలతో ఫాంటసీ.. కథ మామూలుగా ఉండదు..

ABN , Publish Date - May 16 , 2025 | 10:00 AM

డిఫరెంట్‌ కథలకు కేరాఫ్‌ అడ్రస్ట్‌ దర్శకుడు విఐ ఆనంద్‌(Vi Anand). తన రాత, తీతతో డిఫరెంట్‌ మేకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ రానుంది.

anand

డిఫరెంట్‌ కథలకు కేరాఫ్‌ అడ్రస్ట్‌ దర్శకుడు విఐ ఆనంద్‌(Vi Anand). తన రాత, తీతతో డిఫరెంట్‌ మేకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టైగర్‌ సినిమా మినహా ఆయన దర్శకత్వం వహించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,  ‘ఒక్క క్షణం’, మాస్‌ మహారాజా రవితేజతో ‘డిస్కో రాజా’, ‘ఊరు పేరు భైరవకోన’ ఇలా దేనికదే డిపరెంట్‌ జానర్‌ చిత్రాలు తీశారు. ప్రతి సినిమాలోనూ ఓ యునీక్‌ పాయింట్‌ ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆయన దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ రానుంది. భారీ సోషియో ఫాంటసీ సినిమా ప్లాన్‌ చేశారట. ఇది ఇద్దరు హీరోలపై నడిచే కథ. టాలీవుడ్‌ టాప్‌ హీరోలు ఇద్దరు ఈచిత్రంలో నటించనున్నారు.  ప్రస్తుతం ఆయా హీరోలతో చర్చలు జరుగుతున్నాయి. మల్టీస్టారర్‌ కథ కావడంతో కాస్త గోప్యతగా ఉంచుతున్నారు. హీరోలు ఫైనల్‌ అయ్యాక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన రానుందని తెలిసింది.

హీరోలకు కూడా విఐ ఆనంద్‌ కథలపై ఓ ఐడియా ఉంది. ప్రజంటేషన్‌ బావుంటుందనే భావన హీరోల్లో ఉంది. ఈ సినిమాకు నిర్మాత కూడా రెడీగా ఉన్నారు. బడ్జెట్‌ విషయంలో లెక్కలేదు. పాన్‌ ఇండియా స్థాయిలో సోషల్‌ ఫాంటసీ ఫిలింను ప్రొడ్యూస్‌ చేయడానికి ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ అధినేత నిరంజన్‌ రెడ్డి (Niranjen Reddy) సిద్ధంగా ఉన్నారు. ‘హనుమాన్‌’ సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ప్రస్తుతం సాయిదుర్గా తేజ్‌ హీరోగా ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పుడు వీఐ ఆనంద్‌ సినిమాతో పాటు మరో రెండు భారీ పాన్‌ ఇండియా సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు.  
 
 
     

Updated Date - May 16 , 2025 | 10:23 AM