Venu Udugula: నవల ఆధారంగా సినిమా.. ఆ ఇద్దరే హీరోలు..

ABN , Publish Date - Nov 24 , 2025 | 10:31 AM

‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాలతో క్లాస్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు వేణు ఉడుగుల (Venu Udugula). ఆయన దర్శకత్వంలో విరాటపర్వం విడుదలై మూడేళ్లు దాటింది.

‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాలతో క్లాస్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు వేణు ఉడుగుల (Venu Udugula). ఆయన దర్శకత్వంలో విరాటపర్వం విడుదలై మూడేళ్లు దాటింది. తదుపరి చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమా ఖాయమైందని చాలాకాలం క్రితం వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్‌ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇప్పుడు సడెన్‌గా ఓ  మల్టీస్టారర్  చేయడానికి రంగం సిద్థం చేస్తున్నాడని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. పెద్దింటి అశోక్‌ కుమార్‌ రాసిన ఓ నవల ఆధారంగా దర్శకుడు వేణు ఓ కథ రాసుకొన్నాడు. యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని తెలిసింది. ఈ కథకు ఓ పెద్ద హీరో, ఓ యంగ్‌ హీరో కావాలి. ఓ టాప్‌ హీరోకి కథ చెప్పగా అతనికి కథ నచ్చింది. కానీ చివరి క్షణంలో డ్రాప్‌ అయ్యాడు.

ఇప్పుడు ఈకథని మోహన్‌ లాల్‌ దగ్గరకు తీసుకెళ్దామనుకొంటున్నారు. యువ హీరోగా శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ దాదాపు ఫిక్సయ్యాడు. అన్నీ కుదిరితే.. మోహన్‌ లాల్‌, రోషన్‌ కాంబోలో ఈ సినిమా వస్తుందని సమాచారం. ప్రస్తుతం వేణు ఉడుగుల ఈ స్ర్కిప్టు పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈవారం విడుదలైన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయిలు కంపాటిని దర్శకుడిగా పరిచయం చేశారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 

Updated Date - Nov 24 , 2025 | 11:05 AM