వెంకీ - చెర్రీ.. త్రివిక్రమ్‌ కథ ఖాయమేనా?

ABN , Publish Date - May 17 , 2025 | 09:07 PM

వెంకటేశ్‌ (Venkatesh), మాటల మాంత్రికులు త్రివిక్రమ్‌ (Trivikram) కాంబోలో ఓ సినిమా రానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ కూడా సందర్భం వచ్చిన ప్రతిసారీ సినిమా చేస్తామని చెబుతూ వచ్చారు.


వెంకటేశ్‌ (Venkatesh), మాటల మాంత్రికులు త్రివిక్రమ్‌ (Trivikram) కాంబోలో ఓ సినిమా రానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ కూడా సందర్భం వచ్చిన ప్రతిసారీ సినిమా చేస్తామని చెబుతూ వచ్చారు. ఇప్పుడీ కాంబో సెట్‌ అయినట్లు మరోసారి వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్‌ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ఆలస్యం కావడంతో వెంకటేష్‌ సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు గురూజీ. ఈ కాంబో ఖాయమనే టాలీవుడ్‌ చెబుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని టాక్‌. అయితే ఇది సింగిల్‌ స్టార్‌ సినిమా కాదని, ఈ సినిమాలో మరో స్టార్‌ హీరో  కూడా కనిపించనున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌.

వెంకీతో రామ్‌ చరణ్‌ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తోంది. రామ్‌ చరణ్‌ -త్రివిక్రమ్‌ల కాంబో కూడా ఎప్పటి నుంచో అనుకొంటున్నదే. కానీ ఇప్పటికీ సెట్‌ కాలేదు. సుకుమార్‌ సినిమా తరవాత త్రివిక్రమ్‌తోనే అనుకున్నారు. అయితే ఆ అవకాశం కాస్త ముందే వచ్చేట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్‌ తో బిజీగా ఉంటున్నాడు చెర్రీ. ఒకవేళ త్రివిక్రమ్‌ కథ నచ్చితే, డేట్లు ఎలా సర్దుబాటు చేయాలి? గెటప్‌ ఎలా కంటిన్యూ చేయాలి? అనేదే టాస్క్‌. ఈ రెండు విషయాల్లోనూ ఓ క్లారిటీ వస్తే ఈ కాంబో ఖాయం కావడం పక్కా. ఈసారి త్రివిక్రమ్‌ ఓ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రాసుకొంటున్నాడని టాక్‌.

Updated Date - May 17 , 2025 | 09:12 PM