Venkatesh Next: వెంకటేశ్ తదుపరి చిత్రం.. క్లారిటీ వచ్చింది
ABN , Publish Date - May 09 , 2025 | 03:09 PM
'సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతి బరిలో భారీ విజయం అందుకున్నారు విక్టరీ వెంకటేశ్. అయితే ఈ చిత్రం తర్వాత ఆయన నుంచి వచ్చే సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు.

'సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతి బరిలో భారీ విజయం అందుకున్నారు విక్టరీ వెంకటేశ్(Venkatesh). అయితే ఈ చిత్రం తర్వాత ఆయన నుంచి వచ్చే సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజా సమాచారం ప్రకారం తన తదుపరి చిత్రం దర్శకుడు త్రివిక్రమ్‌తో (Trivikram)ఉంటుందని తెలిసింది. ఇప్పటికే ఈ చిత్ర విషయమై ఇరువురి మధ్య చర్చలు జరిగాయని, త్రివిక్రమ్ ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్న సిద్థం చేేస పనిలో ఉన్నారని తెలిసింది. ఇది ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నారట. గతంలో వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు రచయితగా పని చేశారు త్రివిక్రమ్ . అవి బాక్సాఫీస్ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన ఇన్నేళ్ల తర్వాత కాంబినేషన్ కుదరడంతో అభిమానులు ఆనందిస్తున్నారు.