Venkatesh: వెంకీ మామ ప్లానే వేరు.. ఫుల్‌ ప్యాక్డ్‌..

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:51 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్‌ మారింది. కొత్తదనానికి క్రేజ్‌ పెరిగింది. కథలో బలం ఉండి, నటన ప్రాధాన్యం ఉంటే అగ్ర హీరోలు సైతం అతిథి పాత్రలు, సినిమాకు కీలకం అనే పాత్రలు లేదా మల్టీస్టారర్‌ సినిమాలు చేయడానికి వెనకాడటం లేదు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్‌ మారింది. కొత్తదనానికి క్రేజ్‌ పెరిగింది. కథలో బలం ఉండి, నటన ప్రాధాన్యం ఉంటే అగ్ర హీరోలు సైతం అతిథి పాత్రలు, సినిమాకు కీలకం అనే పాత్రలు లేదా మల్టీస్టారర్‌ (Multistarrer) సినిమాలు చేయడానికి వెనకాడటం లేదు. ఇప్పుడు అలాంటి అగ్ర కథానాయకులను ఒకే సినిమాలో చూడబోతున్నాం. ఇప్పటికే వెంకటేశ్‌(Chiranjeevi) చిరంజీవి, అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో వస్తున్న 'మెగా 157'లో నటించబోతున్నారు. అలాగే బాలయ్య సినిమాలోనూ వెంకటేశ్‌ భాగం కానున్నారు. ఈ విషయాన్ని అమెరికా వేదికగా జరుగుతున్న 'నాట్స్‌ 2025' ఈవెంట్‌లో వెంకటేశ్‌ స్వయంగా ప్రకటించారు.


Chiru.jpg

ఇప్పటికే చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమాలో వెంకటేశ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అది కాకుండా త్వరలోనే బాలకృష్ణతో కలిసి ఓ సినిమాలో (Balakrishna with Venkatesh) నటించబోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అందులోనే వెంకటేశ్‌ కూడా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

NBK.jpg

అలాగే త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నాట్లు కూడా ఆయన తెలిపారు. చిరంజీవితో చేయబోయే కామియో ఫుల్‌ ఫన్‌ రైడ్‌ అనీ, మీనాతో మళ్లీ దృశ్యం సీక్వెల్‌ కంటిన్యూ అవుతుందని చెప్పారు. అనిల్‌ అనిల్‌ రావిపూడితో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండో భాగం ఉంటుందనీ, ముఖ్యంగా బాలయ్యతో చేయబోయే సినిమా భారీగా ఉంటుందని తెలిపారు వెంకటేశ్‌.

Updated Date - Jul 08 , 2025 | 03:51 PM