Venkatesh: ఫెయిల్యూర్స్ తో పనిలేదు విక్టరీనే ఫిక్స్

ABN , Publish Date - Dec 13 , 2025 | 07:16 AM

విక్టరీ వెంకటేశ్ ఈ యేడాది ఆరంభంలోనే 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ భలేగా వినోదం పంచారు... వచ్చే సంవత్సరం కూడా అదే తీరున సాగాలని ఆశిస్తున్నారు వెంకటేశ్... డిసెంబర్ 13న వెంకటేశ్ బర్త్ డే.. 65 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వెంకీకి విషెస్ చెబుతూ ఆయన బాణీని గుర్తు చేసుకుందాం...

విక్టరీ వెంకటేశ్ (Venkatesh)ఈ యేడాది ఆరంభంలోనే 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ భలేగా వినోదం పంచారు... వచ్చే సంవత్సరం కూడా అదే తీరున సాగాలని ఆశిస్తున్నారు వెంకటేశ్.. డిసెంబర్ 13న వెంకటేశ్ బర్త్ డే... 65 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వెంకీకి విషెస్ చెబుతూ ఆయన బాణీని గుర్తు చేసుకుందాం.

ఇంటిల్లిపాది చూసే విధంగా...

తెలుగు చిత్రసీమలో 'విక్టరీ'ని ఇంటిపేరుగా మార్చుకున్న స్టార్ హీరో వెంకటేశ్- అందుకు తగ్గట్టుగానే ఆయనను విజయాలు వరిస్తూ వస్తున్నాయి. ఎప్పుడైనా వరుస ఫ్లాపులు పలకరించినా, అనూహ్యంగా ఏదో ఒక ఘనవిజయం వెంకటేశ్ ఖాతాలో చేరిపోతూ ఉంటుంది. ఇక నటునిగానూ తనదైన పంథా పలికిస్తూ పలు చిత్రాల్లో పరవశింప చేశారు. ఆయన అభినయానికి ఐదుసార్లు ఉత్తమ నటునిగా నంది అవార్డులు లభించాయి. ఆ తీరున కూడా వెంకటేశ్ ఓ రికార్డ్ సృష్టించారనే చెప్పాలి... ఇంటిల్లిపాది చూసే విధంగా వెంకటేశ్ చిత్రాలు ఉంటాయని ప్రేక్షకుల భావన. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎప్పటికప్పుడు వెంకటేశ్ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు.

chiru.jpg

వారికి రోల్ మోడల్...
స్టార్ హీరోస్ తనయులు వారి వారసులుగా అలరిస్తున్న సమయంలో ఓ నిర్మాత కొడుకు కూడా స్టార్ కాగలడని నిరూపించారు వెంకటేశ్. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది నిర్మాతల వారసులు నటనలో అడుగు పెట్టారు... అయితే వెంకటేశ్ స్థాయిలో అలరించిన వారు అంతగా కనిపించరు. ఎందరు నిర్మాతల తనయులు స్టార్స్ గా మారినా, వారందరిలోకి ఓ రత్నంలా మెరుస్తూనే ఉన్నారు వెంకటేశ్.

వైవిధ్యానికే పెద్ద పీట...

తొలి చిత్రం 'కలియుగ పాండవులు' మొదలు మొన్నటి 'సంక్రాంతికి వస్తున్నాం' దాకా వైవిధ్యానికే పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు వెంకటేశ్... యంగ్ స్టార్స్ తో నటించి మల్టీస్టారర్స్ కు ఊపు తీసుకు వచ్చారు వెంకీ... తన తరం నటుడు మెగాస్టార్ చిరంజీవితో కలసి 'మన శంకరవరప్రసాద్ గారు'లో కీలక పాత్రలో నటించారు వెంకటేశ్... సంక్రాంతి కానుకగా ఆ చిత్రం రానుంది... ఇక రాబోయే వేసవిలో అలరించడానికి 'ఆదర్శ కుటుంబం'తో వస్తున్నారు... రాబోయే చిత్రాలతోనూ తనదైన బాణీ పలికిస్తూ వెంకటేశ్ అలరిస్తారని చెప్పవచ్చు...

Updated Date - Dec 13 , 2025 | 07:18 AM