Varun tej 15: ఇది రెండోసారి.. అప్పుడే రెండు పాటలు పూర్తి 

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:05 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న varuntej15 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజా అప్డేట్ ఏంటంటే

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న #VT15 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  రితికా నాయక్ కథానాయిక. ఇండియన్ & కొరియన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఓ వినూత్న కథతో హారర్-కామెడీగా  ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే భారతదేశంతో పాటు విదేశాల్లో మూడు కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

ప్రస్తుతం మ్యూజిక్ సెషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే రెండు ఎనర్జిటిక్ సాంగ్స్ షూటింగ్  పూర్తయ్యాయి. ఈ రెండు పాటలు సినిమాకు హైలైట్ కానున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ తేజ్, థమన్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. వరుణ్ కోసం  మరోసారి అదరగొట్టే ఆల్బమ్ ఇవ్వదానికి థమన్ కష్టపడుతున్నారు అని మేర్లపాక గాంధీ అన్నారు. త్వరలోనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. 

Updated Date - Jul 22 , 2025 | 05:14 PM