Varun - Lavanya: కొణిదెల వార‌సుడి.. పేరు ఇదే

ABN , Publish Date - Oct 02 , 2025 | 03:15 PM

మెగా పెయిర్‌ వరుణ్‌ తేజ్‌, త్రిపాఠి దంపతులు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే!  గత నెల 10న లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల బారశాల కూడా చేశారు.

మెగా పెయిర్‌ వరుణ్‌ తేజ్‌, త్రిపాఠి (varun Tej -Lavanya Tripati) దంపతులు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే!  గత నెల 10న లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల బారశాలు కూడా చేశారు. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. దసరా పర్వదినం సందర్భంగా వరుణ్‌-లావణ్య దంపతులు తమ బిడ్డకు నామకరణం చేశారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని ‘వాయువ్‌ తేజ్‌’ (Vaayuv Tej) అని నామకరణం చేసినట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. దీంతో మెగా అభిమానులు విపరీతంగా లైక్‌ చేస్తూ, షేర్‌ చేస్తున్నారు.


Varun-teja.jpg

‘ముకుంద’ చిత్రంతో హీరోగా పరిచయమైన వరుణ్‌ తేజ్‌, ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్‌ 2 తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మిస్టర్‌, అంతరిక్షం చిత్రాల్లో లావణ్యతో కలిసి నటించారు. మిస్టర్‌ చిత్రం తర్వాత ఏడేళ్లపాటు రిలేషన్‌లో ఉన్నారు. 2023లో వివాహబంధంతో ఒకటయ్యారు. 

Updated Date - Oct 02 , 2025 | 08:58 PM