police compliant: పోలీస్ గెటప్ లో వరలక్ష్మి శరత్ కుమార్

ABN , Publish Date - May 30 , 2025 | 06:57 PM

సినిమాలో నటీనటులు ఎవరైనా పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారంటే సినీ ప్రియులంతా ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే స్టార్ హీరోలకు పోటీగా హీరోయిన్స్‌ కూడా ఖాకీ డ్రెస్‌ వేసి పోలీస్‌ పాత్రల్లో అదరగొడుతున్నారు. తాజాగా అలాంటి రోల్ లో మెప్పిచేందుకు వరలక్ష్మి శరత్ కుమార్ రెడీ అయ్యారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) తమిళ్ బ్యూటీ అయినప్పటికి... తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఏ రోల్ చేసిన ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోస్తుంది. అందుకే హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారింది. పైగా పెళ్లి తర్వాత మరింత స్పీడ్ ను పెంచింది. నెగిటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్, వెబ్ సీరిస్ తో పాటు లేడీ ఓరియెంటెంట్ మూవీస్ లో నటిస్తోంది. త్వరలో ఆమె 'పోలీస్ కంప్లెయింట్' (police compliant) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) జయంతి సందర్భంగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్‌లో వరలక్ష్మి గన్ ఫైర్ చేస్తూ సీరియస్ లుక్‌లో కనిపించి మెప్పించడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది.


హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కాన్సెప్ట్ తో 'పోలీస్ కంప్లెయింట్' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ రోల్ తో పాటు వినోదాన్ని కలిగించే క్యారెక్టర్ లో వరలక్ష్మి నటిస్తోంది. ఈ చిత్రాన్ని సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి (Sanjeev Megoti) దర్శకత్వం వహించగా, శ్రీ హర్ష (Sri Harsha), నవీన్ చంద్ర (Naveen Chandra), రాజశ్రీ నాయర్ (Rajshri Nair), కృష్ణ సాయి (Krishna Sai) , రాగిణి ద్వివేది (Ragini Dwivedi) , రవిశంకర్ (Ravi Shankar ), ఆదిత్య ఓం (Aditya Om) వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే... ఈ చిత్రాన్ని 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్తు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ మీద ఎ.ఐ. టెక్నాలజీతో స్పెషల్ సాంగ్ ను షూట్ చేసామని, అది సినిమాకే మెయిన్ హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయన్నారు. మరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వరలక్ష్మి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - May 30 , 2025 | 06:57 PM