Uv Creations: మాకు ఆ వ్య‌క్తితో సంబంధం లేదు.. న‌మ్మ‌కండి

ABN , Publish Date - Jul 03 , 2025 | 08:42 PM

త‌మ‌ పేరును ఉపయోగించి నటీమణులకు నకిలీ ఆఫర్లు చేస్తున్నట్టు ఫిర్యాదుల నేపథ్యంలో, UV క్రియేషన్స్ ఓ లెట‌ర్ రిలీజ్ చేశారు.

ప్ర‌భాస్ మిర్చి సినిమాతో మొద‌లుపెట్టి వ‌రుస భారీ చిత్రాల‌తో టాలీవుడ్‌లో తిరుగులేకుండా దూసుకు వెళ్తున్న నిర్మాణ సంస్థ యూవీ క్రియేస‌న్స్ (UV Creations). ప్ర‌స్తుతం చిరంజీవి విశ్వంభ‌ర‌, అనుష్క ఘాటీ సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే ఈ సంస్థ‌కు తాజాగా ఓ వింత ప‌రిస్థితి ఎదురైంది. దాంతో వారు మీడియా ముందుకు రాక త‌ప్ప‌లేదు. రీసెంట్‌గా త‌మ‌కు ఎదుకైన స‌మ‌స్య నేప‌థ్యంలో ఓ లెట‌ర్ విడుద‌ల చేశారు.

ఓ అనామక వ్యక్తి.. తాను UV క్రియేషన్స్‌కు చెందినవాడినంటూ నటీమణులను, వారి ప్రతినిధులను తప్పుడు ఆఫర్లతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. స‌ద‌రు వ్యక్తితో మా సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. UV క్రియేషన్స్ తరఫున వచ్చే అన్ని అధికారిక సమాచారం, కాస్టింగ్ ప్రక్రియలు నమ్మదగిన, సరైన మార్గాల ద్వారా మాత్రమే జరుగుతాయి.

uv.jpg

ఈ విషయాన్ని పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలని, ఎవ్వరైనా ఈ తరహా అనామక ప్రతినిధులతో ముందుకు వెళ్లేముందు తప్పకుండా నిజం తెలుసుకోవాలని మనవి. మాకు ఏ అవసరాలు ఉన్నా లేదా కాస్టింగ్ కాల్స్ ఉన్నా, అవి అధికారికంగా, నమ్మదగిన మీడియా ద్వారా మాత్రమే తెలియజేస్తాం అన్నారు. మా పేరు, బ్రాండ్‌ను దుర్వినియోగం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

Updated Date - Jul 03 , 2025 | 08:42 PM