Ustaad Bhagat Singh: ఉస్తాద్ కు విలన్ దొరికినట్లేనా...

ABN , Publish Date - Jun 16 , 2025 | 06:49 PM

అన్నీ రెడీగా ఉన్నాయి... ఆ ఒక్క విషయంపై ఎంతకూ క్లారిటీ ఇవ్వడం లేదు పవర్ స్టార్ మూవీ మేకర్స్. అప్పుడెప్పుడో మూవీ మొదలైనా అసలు విషయాన్నే బయటపెట్టలేదు. ఎవరిని తీసుకొస్తున్నారు.. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేవి ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. ఇంతకీ ఈ సస్పెన్స్ దేని గురించి అనుకుంటున్నారా... ఈ కథనం చదవండి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద పవన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. హై ఓల్టేజ్ సీన్స్‌తో రచ్చ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక, టీమ్ అంతా ఓవర్సీస్‌కి వెళ్లబోతోంది. అక్కడ మరో లెవెల్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ, ఈ సినిమాలో విలన్ ఎవరు అన్నది ఇప్పటిదాకా టాప్ సీక్రెట్‌గా ఉంది.


హరీష్ శంకర్ సినిమా అంటే విలన్ క్యారెక్టర్‌ ఓ రేంజ్ లో ఉంటుంది. కొంచెం స్టైల్, కాస్త స్వాగ్, పైగా పవన్‌తో సీన్స్‌లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ టచ్ కూడా కలగలిపి ఉండాలి. అందుకే ఈ రోల్‌కి ఇంకా ఎవరినీ ఫిక్స్ చేయలేదు. కానీ, లేటెస్ట్ టాక్ ఏంటంటే.. తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్‌ (Parthipan)ని ఈ విలన్ రోల్‌కి లాక్ చేసినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈయన కోసం స్పెషల్ లుక్ టెస్ట్ కూడా జరిగినట్టు సమాచారం. పార్తిబన్ ఈ క్యారెక్టర్‌కి ఫర్ఫెక్ట్‌గా సెట్ అయినట్లు, ఈ రోల్ దాదాపు ఖాయమైనట్లు చెప్తున్నారు.

పార్తిబన్‌ గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మూవీలో రచ్చ(Racha)లో నటించాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లో మళ్ళీ కనిపించలేదు. కానీ, తమిళ సినిమాల్లో నటుడిగా, డైరెక్టర్‌గా ఫుల్ ఫేమ్ కొట్టాడు, ఫ్యాన్ బేస్ కూడా సాలిడ్‌గా ఉంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ మూవీలో విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.అప్పట్లో అబ్బాయ్ తో ఇప్పుడు బాబాయ్ తో నటిస్తున్నాడని తెలిసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఒకవేళ ఈ సినిమా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్టయితే, చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు గట్టి షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్పెషల్‌గా, సముతిరకని లాంటి వాళ్లకు ఈయన హాట్ కాంపిటీటర్ కావొచ్చు. సముతిరకని ఇప్పటిదాకా తెలుగులో విలన్‌గా, కీ-రోల్స్‌లో ఫైర్ బ్రాండ్‌లా కనిపిస్తున్నాడు. కానీ, పార్తిబన్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయితే, సముతిరకని సహా టాలీవుడ్‌లోని ఇతర నటులకు సీరియస్ రేస్ స్టార్ట్ అవుతుంది. చూడాలి మరి పార్తిబన్ ఈ పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తాడో.

Updated Date - Jun 16 , 2025 | 06:50 PM