Uppal Balu: అత్తరు సాయబో.. అంటున్న ఉప్పల్ బాలు! వీడియో సాంగ్ రిలీజ్
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:47 AM
ఇన్‌ప్లూయన్సర్ ఉప్పల్ బాలు లీడ్‌గా నటించిన ఓ ఫోక్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది.
హాయ్ అండీ నేనండి మీ ఉప్పల్ బాలు సోషల్ మీడియా ఫేమస్ అంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇన్‌ఫ్లూయెన్సర్ ఉప్పల్ బాలు (Uppal Balu). తనకున్న భిన్న మనస్తత్వం, ప్రవర్తనతో క్రేజ్ సంపాదించుకున్న ఆయన టిక్‌టాక్ వీడియోలతో బాగా వైరల్ అయ్యాడు. ఆపై తనకు వచ్చిన పేరుతో అనేక టీవీ షోలలో, ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. అయితే ఇప్పుడు ఆయన లీడ్‌గా నటించిన ఓ ఫోక్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన అత్తరు సాయబు ఎంతో మంచోడమ్మా (ATTARU SAYABU MANCHODAMMA) అంటూ సాగే పాటను విడుదల చేశారు. పాత పాటను పూర్తిగా సవరించి దాని స్థానంలో నేటి తరానికి కనెక్ట్ అయ్యే కొత్త పదాలను ఉపయోగించారు. అంతేగాక ఉప్పల్ బాలు (Uppal Balu) తనకు ఉన్న శక్తియిక్తులను అన్నింటిని ఉపయోగించి డ్యాన్స్ చేసి ఆలరించాడు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు.
ఈ జానపద పాటకు నాగరాజు కాసాని (Nagaraju Kasani) సాహిత్యం అందించగా వెంకట్ అజ్మీర (Venkat Ajmeera) సంగీతంలో శివ నాగులు (Shiva Nagulu) ఆలపించాడు. రఘు జాన్ (Raghu Jaan) నృత్యం సమకూర్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.