Upasana Konidela: హైదరాబాద్ జూలో ఉపాసన.. ఎందుకంటే
ABN , Publish Date - Jun 20 , 2025 | 07:03 PM
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ బృందానికి ఆమె ధ్యాంక్స్ చెప్పారు.
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ బృందానికి ఆమె ధ్యాంక్స్ చెప్పారు. శుక్రవారం క్లీంకార పుట్టినరోజు (klinkaara second Birthday) పాప జన్మించి రెండేళ్లు అయింది. క్లీంకార పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాద్ జూలోని ఒక ఆడపులికి క్లీంకార పేరు పెట్టింది. క్లీంకార తో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకున్నారు. ఇందులో ఉపాసన - క్లీంకార ఆ ఆడపులి ని చూస్తూ కనిపించారు.
నెహ్రూ జూపార్కులో పులి పిల్లను గురువారం ఉపాసన దత్తత తీసుకున్నారు. తన కుమార్తె క్లీంకారతో జూకు చేరుకున్న ఆమె జూలోని వివిధ జంతువుల ఎన్‌క్లోజర్లను వీక్షించారు. అనంతరం జూపార్కు డైరెక్టర్ డా.సునీల్ ఎస్.హిరేమత్‌ను సంప్రదించి పులి పిల్లను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. వాటి పోషణకు అవసరమైన డబ్బులను చెక్కు రూపంలో జూపార్కు డైరెక్టర్‌కు అందజేశారు.
‘‘ఒక ఏడాది క్రితం అది కేవలం ఒక చిన్న పులి పిల్ల. కానీ, ఈరోజు అదొక ఉల్లాసభరితమైన ఆడపులి. దానికి మా కుమార్తె క్లీంకార పేరునే పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విధంగా ప్రేమాభిమానాలు చూపించిన హైదరాబాద్ జూ బృందానికి ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవికే సొంతమైనప్పటికీ, వాటిని సంరక్షించడానికి మనం మద్దతు తెలుపుతుంటాం’’ ఆమె రాసుకొచ్చారు.