Itlu Mee Yedhava: ఉన్న‌ట్టా లేన‌ట్టా సాంగ్‌.. పాత ఆర్పీని గుర్తు చేశారుగా

ABN , Publish Date - Oct 27 , 2025 | 09:10 AM

త్రినాథ్‌ కఠారి (Trinadh Katari) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’.

Itlu Mee Yedhava

త్రినాథ్‌ కఠారి (Trinadh Katari) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’ (Itlu Mee Yedhava). బళ్లారి శంకర్‌ నిర్మాత. సాహితీ అవాంచ (Sahithi Avancha) కథానాయిక. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వ‌స్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేక‌ర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల ‘ఉన్నట్ట మరి లేనట్టా’ (Unnatta Mari Lenatta) అంటూ సాగే ప్రేమ గీతాన్ని నటుడు శ్రీకాంత్‌ చేతుల మీదుగా యూనిట్‌ విడుదల చేసింది. ఈ గేయానికి పూర్ణాచారి సాహిత్యం అందించగా చాలా కాలం త‌ర్వాత‌ ఆర్పీ పట్నాయక్ (R P Patnaik) స్వరపరిచారు. ఎస్‌ పి చరణ్ (S P Charan), శ్రుతిక సముద్రాల (Shruthika Samudrala) ఆలపించారు. ఈ పాట వింటుంటూ పాత ఆర్పీ ప‌ట్నాయ‌క్ పాట‌ల‌ను గుర్తు చేస్తోంది.

Updated Date - Oct 27 , 2025 | 09:10 AM