NBK: బాలయ్య.. రెండు మాస్ అప్డేట్స్

ABN , Publish Date - Jun 08 , 2025 | 11:37 AM

నందమూరి బాలకృష్ణ నుంచి రెండు అప్డేట్స్ వచ్చాయి. 'ఎన్‌బీకే 110', 'ఎన్‌బీకే 111' చిత్రాల వివరాలను మేకర్స్ వెల్లడించారు 

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం. ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజు  సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్‌ విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. జూన్ఈ 9న సాయంత్రం 6.03 నిమిషాలకు టీజర్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ను వదిలారు. 

Akshanda.jpg

జార్జియాలో ఈ సినిమా చిత్రీకరణ చేసుకుంటోంది. దీనిలో భాగంగా బాలయ్యతో పాటు ముఖ్య తారాగణంపై ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.  ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది.  బాలయ్య ఇందులో రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నారు.  

NBK-111.jpg

రోరింగ్‌ లౌడర్‌..

బాలయ్య నుంచి అభిమానులకు మరో శుభవార్త అందింది. 'ఎన్‌బీకే 111' అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. వీరసింహారెడ్డి చిత్రంతో బాలయ్య ఖాతాలో మరో హిట్‌ వేసిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఆయనతో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. గోపీచంద్‌ మలినేని తాజాగా ఎక్స్‌ వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని పేర్కొన్నారు.ఎన్‌బీకేఏ111: ది హిస్టారికల్‌ రోర్స్‌ బిగిన్స్‌ అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Jun 08 , 2025 | 12:26 PM