Trivikram : బన్నీ ఆగమన్నాడు.... చెర్రీ గో హెడ్ అన్నాడు...

ABN , Publish Date - Jun 10 , 2025 | 07:13 PM

కొన్నిసార్లు అంతే.. అనుకున్నవన్నీ జరగవు.. అనుకోనివి ఆగవు.. సరిగ్గా అదే జరుగుతోంది ఇండస్ట్రీలో. ఫ్యాన్స్ ఒక్కటి ఊహించుకుంటే మేకర్స్ మరొకటి ప్లాన్ చేస్తున్నారు. సమయం మారే కొద్ది వెంట వెంటనే కాంబినేషన్లను చేంజ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు.

ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనుకోని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ‘పుష్ప 2’ ( Pushpa 2) తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో భారీ బడ్జెట్ పౌరాణిక డ్రామా (Mythological Drama)వస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అట్లీ ఎంట్రీతో బన్నీ (Bunny) , త్రివిక్రమ్ (Trivikram) ని , వెయిటింగ్ లో పెట్టాడు. కానీ ఇప్పటికే లాంగ్ గ్యాప్ ఉన్న త్రివిక్రమ్ ఆలస్యం చేస్తే తన కెరీర్ కి నష్టమని భావించి వెంకటేశ్(Venkatesh )తో టచ్‌లోకి వెళ్లాడు‌‌. ఇప్పుడు సడెన్‌గా సీన్‌లో మరో ట్విస్ట్ వచ్చి పడింది. త్రివిక్రమ్ త్వరలో రామ్ చరణ్‌(Ram Charan)తో సినిమా సెట్ చేస్తున్నాడనే బజ్ వినిపిస్తోంది.


ఇంట్రెస్టింగ్ టాక్ ఏంటంటే... త్రివిక్రమ్-చరణ్ కాంబోకి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రికమెండేషన్ ఉందట. ఓ వైపు హారికా - హాసినీ క్రియేషన్స్‌( Haarikaa Haasinee Creations) తో వెంకటేశ్‌-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి మీడియాలో ఫుల్ హైప్ నడుస్తున్నా, రామ్ చరణ్ ప్రాజెక్ట్ వార్తలు ఒక్కసారిగా స్పాట్‌లైట్ లోకి వచ్చేశాయి. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉన్నాడు, అటు సుకుమార్‌(Sukumar)తో నెక్స్ట్ మూవీ కూడా లాక్ చేసేశాడు. కానీ, సుకుమార్ ఇంకా స్క్రిప్ట్‌ని పర్ఫెక్ట్‌గా రెడీ చేయలేదని, షూట్ స్టార్ట్ చేయడానికి టైమ్ పడుతోందని టాక్. ఈ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ని చరణ్‌తో ఓ సినిమా సెట్ చెయ్ అని సజెస్ట్ చేశాడట.

మరో న్యూస్ ఏంటంటే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments) ఈ త్రివిక్రమ్-చరణ్ కాంబో మీద లాంగ్ టైమ్ నుంచి కన్నేసి ఉంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ ఇన్‌సైడర్స్ మాత్రం త్వరలో బిగ్ అప్‌డేట్ ఉంటుందని కన్ఫామ్‌గా చెబుతున్నారు. అటు వెంకటేశ్ తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా ట్రాక్‌లోనే ఉంది. దానిలో ఎలాంటి చేంజ్ లేదని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో!?

Updated Date - Jun 10 , 2025 | 07:22 PM