Trivikram: అల్లు అర్జున్ కథ ఎన్టీఆర్ వద్దకు .. ?
ABN , Publish Date - Jun 10 , 2025 | 09:47 PM
ప్రస్తుతం గత కొన్నిరోజులుగా త్రివిక్రమ్(Trivikram) తరువాతి ప్రాజెక్ట్స్ గురించే చర్చ నడుస్తోంది. పుష్ప 2(Pushpa 2) తరువాత అల్లు అర్జున్(Allu Arjun) .. త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.
Trivikram: ప్రస్తుతం గత కొన్నిరోజులుగా త్రివిక్రమ్(Trivikram) తరువాతి ప్రాజెక్ట్స్ గురించే చర్చ నడుస్తోంది. పుష్ప 2(Pushpa 2) తరువాత అల్లు అర్జున్(Allu Arjun) .. త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. డైనమిక్ డ్యూ(Dynamic Duo) అనే పేరుతో బన్నీ - త్రివిక్రమ్ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా.
ఇక పుష్ప 2 తరువాత.. బన్నీ, అట్లీ(Atlee) సినిమాను ఓకే చేయడంతో పాటు పట్టాలు కూడా ఎక్కించేశాడు. అట్లీ సినిమా అవ్వడానికి దాదాపు ఏడాది పడుతుంది. ఈలోపు గురూజీ.. ఎప్పటినుంచో వెంకటేష్(Venkatesh) తో ఒక సినిమా చేయాలనుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సినిమాను పట్టాలెక్కించి పనిలో ఉన్నాడు. ఇక ఇది కాకుండా రామ్ చరణ్(Ram Charan) తో కూడా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చరణ్ కు కథ వినిపించడం, ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిందట.
అయితే చరణ్ తో సినిమా అనేసరికి.. అది బన్నీకి వినిపించిన కథనే అని టాక్ నడిచింది. అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్ కు గురూజీ చెప్పిన కథ బన్నీది కాదట. అది పూర్తిగా వేరని తెలుస్తోంది. ఇక బన్నీకి చెప్పిన కథను త్రివిక్రమ్.. ఎన్టీఆర్(NTR) కు చెప్పడానికి రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. అట్లీ సినిమా తరువాత అయినా త్రివిక్రమ్ సినిమాకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనే నమ్మకం లేదు. దీంతో బన్నీతో సినిమాను క్యాన్సిల్ చేసుకొని ఆ కథను ఎన్టీఆర్ తో చేయాలని చూస్తున్నాడట గురూజీ.
మైథలాజికల్ జోనర్ కాబట్టి.. ఎన్టీఆర్ బాగా సెట్ అవుతాడని, ఈ కథకు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పేలా ఉన్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో అరవింద సమేత లాంటి హిట్ పడింది. ఇప్పుడు ఈ కాంబో రిపీట్ అవుతుంది అంటే ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతాయి.
ఈ ఏడాదిలోనే గురూజీ.. వెంకటేష్ మూవీని పట్టాలెక్కిస్తాడు. అది వచ్చే ఏడాదికి రిలీజ్ అవుతుంది. దీని తరువాత చరణ్ మూవీ. ఒకవేళ చరణ్ కనుక బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడట త్రివిక్రమ్. ఇంకోపక్క ఎన్టీఆర్ .. వార్ 2 ను ముగించి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోపు పూర్తి అవుతుంది. ఎన్టీఆర్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కేస్తోంది. మరి ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతుందో లేదో చూడాలి.