Trivikram: వారిద్దరూ వింధ్యా హిమాలయ పర్వతాలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 09:32 PM

బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా వార్ 2 (War 2).

Trivikram

Trivikram: బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా వార్ 2 (War 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన వార్ 2 ఆగస్టు 14 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.


వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఇక ఈ వేదికపై త్రివిక్రమ్ మాట్లాడుతూ.. దేవర సినిమా సమయంలో ఇది దేవర నామ సంవత్సరం అని చెప్పాను. ఇప్పుడు ఇది హృతిక్ రామారావు నామ సంవత్సరం అని చెప్తున్నాను. నేనెంతో అభిమానించే వ్యక్తి ఎన్టీఆర్. ఆయనతో నా ప్రయాణం పాతికేళ్ళు. నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్ కు వెళ్లి చప్పట్లు కొట్టిన సినిమా కహా నా ప్యార్ కియా. ఆ సినిమా హీరో హృతిక్ రోషన్. నాకిష్టమైన దర్శకుల్లో అయాన్ ఒకరు. నా కుటుంబ సభ్యుల్లో ఒకరు నాగవంశీ.. ఇలా అందరూ నాకు నచ్చిన వ్యక్తులు ఒకే చోట ఉండడం చాలా ఆనందంగా ఉంది.


ఎన్టీఆర్, హృతిక్ ను చూస్తుంటే రెండు కళ్లు చాలవు. ఆ సాంగ్ టీజర్ లో వీరిద్దరి డ్యాన్స్ చూస్తుంటే మెరుపు తీగల్లా కదులుతున్నారు. ఇద్దరినీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవడంలేదు. సాధారణంగా ఈ సినిమాను యాక్షన్ సినిమాలా చూడడానికి ప్రయత్నించకండి. ఇందులో చాలా పెద్ద సర్ ప్రైజ్ ఉంది. అలాంటి సినిమా కోసం ఎన్టీఆర్ వరకు రావాలా.. ? ఎలాంటి భావాలను పలికించేవాడు అనే కదా ఆయనకు ఉన్న పేరు. అందుకే ఈ సినిమా ఆయన వరకు వెళ్ళింది. బంగారం చేతిలో ఉంటే నాగ చేయించుకోవాలనుకుంటాం కానీ, బీరువాలో దాచుకోవాలనుకొం కదా. ఎన్టీఆర్ తో ఏ నగ చేయించుకోవాలో అయాన్ కు బాగా తెలుసు.


అయాన్ .. ఈ ఇద్దరు హీరోలను చాలా బ్యాలెన్డ్స్ గా చూపించాడని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఈ వినాయక చవితికి వార్ 2 సాంగ్ అన్ని చోట్లా వినిపిస్తుంది. ఎన్టీఆర్, హృతికి ఇద్దరూ వింధ్య హిమాలయా పర్వతాలు. దేవర తరువాత ఎన్టీఆర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఆ వెయిటింగ్ ముగిసింది. వార్ 2 సగటు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ థియేటర్ లో చూసి ఆనందించండి' అంటూ ముగించాడు.

Updated Date - Aug 10 , 2025 | 09:32 PM