Triptii Dimri: నెగెటివ్‌ పాత్రలకు సిద్ధమే

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:10 AM

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు త్రిప్తీ దిమ్రీ. ఇటీవలె ప్రభాస్‌ కథానాయకుడిగా సందీ్‌పరెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్‌’ సినిమాలో...

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు త్రిప్తీ దిమ్రీ. ఇటీవలె ప్రభాస్‌ కథానాయకుడిగా సందీ్‌పరెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్‌’ సినిమాలో అవకాశం కొట్టేసిన ఆమె, దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ చేసే చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే, సిద్దార్థ్‌ చతుర్వేదితో ఆమె నటించిన ‘ధడక్‌ 2’ ఆగస్టు 1న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ఇందులో నేను కాలేజీ విద్యార్థిగా కనిపిస్తాను. నేనిప్పటివరకూ ఎన్నో కామెడీ, లవ్‌ చిత్రాల్లో నటించాను. కానీ యాక్షన్‌ జానర్‌లో రూపొందిన చిత్రాల్లో నటించలేదు. ఒకవేళ అటువంటి సినిమాల్లో అవకాశం వస్తే అస్సలు వదులుకోను. యాక్షన్‌ పాత్రలు చేయడం ద్వారా నా నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించొచ్చని భావిస్తా. కంటెంట్‌ బాగుంటే నెగెటివ్‌ పాత్రలు చేయడానికైనా సిద్ధమే’’ అని పేరొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 06:10 AM