Tribandhari Barbarik: ప్రివ్యూలతో మరింత హైప్..  29న గ్రాండ్ రిలీజ్

ABN , Publish Date - Aug 28 , 2025 | 03:01 PM

త్రిబాణధారి బార్బరిక్ ప్రివ్యూను వరంగల్, విజయవాడ వంటి చోట ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. ఈ స్పెషల్ షో తరువాత చిత్రంపై మరింత హైప్ ఏర్పడింది.

సత్య రాజ్(Satya Raj), వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను(Udaya Bhanu), సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ ‘ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.  ఆగస్ట్ 29న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అందరిని ఆకట్టుకున్నాయి. 

'ఇప్పటికే ‘త్రిబాణధారి బార్బరిక్’ ప్రివ్యూను వరంగల్, విజయవాడ వంటి చోట ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. ఈ స్పెషల్ షో తరువాత చిత్రంపై మరింత హైప్ ఏర్పడింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.  సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. కంటెంట్‌తో పాటుగా, మంచి సందేశాన్ని ఇచ్చేలా ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీని తెరకెక్కించారని టీంపై ప్రశంసలు కురిపించారు' అని మేకర్స్ చెప్పారు. ఇక ఈ చిత్రానికి కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్, ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

Updated Date - Aug 28 , 2025 | 03:01 PM