Tragic Loss: నటి పాయల్‌ రాజ్‌పుత్‌ ఇంట విషాదం

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:23 AM

నటి పాయల్‌ రాజ్‌పుత్‌ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్‌ కుమార్‌ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం...

నటి పాయల్‌ రాజ్‌పుత్‌ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్‌ కుమార్‌ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు పాయల్‌ రాజ్‌పుత్‌ తెలిపారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘ప్రతీక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటా నాన్నా. మీరు క్యాన్సర్‌ను జయిస్తారని అనుకున్నాను. మీకు మనోధైర్యం ఇవ్వడానికి నేను చేయాల్సిందల్లా చేశాను. మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను, క్షమించండి’’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 06:23 AM