Tollywood Heroes: పండగా.. పబ్బం లేకుండా పనిచేస్తున్న స్టార్స్
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:50 PM
ఈ మధ్య కాలంలో పలువురు టాలీవుడ్ స్టార్స్ క్రిస్మస్ ను ఘనంగా జరుపుకుంటున్నారు. డిసెంబర్ 24 రాత్రి నుండి 31 రాత్రి దాకా ఎంజాయ్ చేస్తున్నారు.
Tollywood Heroes: ఈ మధ్య కాలంలో పలువురు టాలీవుడ్ స్టార్స్ క్రిస్మస్ ను ఘనంగా జరుపుకుంటున్నారు. డిసెంబర్ 24 రాత్రి నుండి 31 రాత్రి దాకా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెబుతూ చేసే సందడి వేరుగా ఉంటుంది. దాంతో జనవరి 1వ తేదీన చాలామంది బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ సారి 2026 జనవరి 1వ తేదీన పలువురు టాప్ స్టార్స్ తమ కొత్త సినిమాల షూటింగ్స్ తోనే గడిపేలా కనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) - సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించే 'స్పిరిట్'లో నటిస్తున్నారు. ఆ సినిమా షెడ్యూల్ జనవరి 5 దాకా సాగనుంది. అందువల్ల జనవరి 1వ తేదీ కూడా 'స్పిరిట్' షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక జూనియర్ యన్టీఆర్ (NTR) కూడా ప్రశాంత్ నీల్ రూపొందించే సినిమా షూటింగ్ లో పాలు పంచుకోనున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో స్టార్ హీరో మహేశ్ బాబు(Mahesh Babu) నటిస్తోన్న 'వారణాసి' సైతం జనవరి 1న షూటింగ్ జరుపుకుంటోందని తెలుస్తోంది... ఇలా ఈ టాప్ స్టార్స్ అందరూ 2026 ఇయర్ కు వర్క్ తో స్వాగతం పలుకుతూ ఉండడం విశేషం.
సీనియర్ స్టార్స్ విషయానికి వస్తే నటసింహ బాలకృష్ణ తన తాజాచిత్రం షూటింగ్ లోనే న్యూ ఇయర్ గడప నున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన 'మన శంకరవరప్రసాద్ గారు' ప్రమోషన్స్ లో భాగంగా న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ లో వెంకటేశ్ పాలుపంచుకుంటున్నారు... నాగార్జున ఎప్పటిలాగే తన కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో గడపనున్నారు. మొత్తానికి టాలీవుడ్ టాప్ స్టార్స్, సీనియర్ స్టార్స్, యంగ్ హీరోస్ అందరూ 2026 మొదటి రోజున తమ చిత్రాల షూటింగ్స్ తోనే సాగుతూ ఉండడం విశేషం.
ఈ స్టార్స్ అందరూ పండగా.. పబ్బం లేకుండా ఉంటే.. ఇద్దరు స్టార్స్ మాత్రం పండక్కి బ్రేక్ తీసుకుంటున్నారు. వారు ఎవరంటే... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే న్యూ ఇయర్ బ్రేక్ అంటూ అమెరికాలో ఉన్నారు. కాబట్టి ఆయన సినిమా షూటింగ్ జనవరి 1న జరగడం లేదని సమాచారం. ఇక మెగాపవర్ స్టా ఇక మిగతా కుర్ర హీరోలు నాని, సాయిధరమ్ తేజ్, శర్వానంద్, గోపీచంద్ వంటి హీరోలందరూ తమ చిత్రాల షూటింగ్స్ లోనే గడిపనున్నారు. మరి 2026 సంవత్సరం వీరందరికీ ఎంత సంతోషాన్ని అందిస్తుందో చూడాలి.