Tollywood Piracy: విడుదల రోజే సినిమాల పైరసీ.. రూ.3,700 కోట్ల నష్టం! యువకుడు అరెస్ట్
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:15 PM
టాలీవుడ్‌లో 65కి పైగా సినిమాలను పైరసీ చేసిన ఏపీ తూర్పుగోదావరి యువకుడు జన కిరణ్‌ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీ వల్ల టాలీవుడ్‌కు రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు టీఎఫ్‌సీసీ ఆరోపణ.
టాలీవుడ్‌లో విడుదలైన పలు భారీ చిత్రాలను సినిమాలని మొదటి రోజే పైరసీ చేసి.. వాటి ద్వారా భారీగా నగదు దండుకుంటున్న ఏపీ తూర్పుగోదావరికి చెందిన జన కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పైరసీ సినిమా ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తోన్నకిరణ్.. హైదరాబాద్ థియేటర్లలోనే కామ్ కార్డు ద్వారా సినిమాను పైరసీ చేసి హెచ్డీ ప్రింట్ రూపంలో వాటిని వన్ తమిళ్ బ్లాస్టర్, వన్ తమిళ్‌ఎమ్‌వీ, 5 మూవీ రూల్జ్, వెబ్ సైట్లకు సహా పలు సైట్లకు విక్రయించేవాడు. ఇందుకుగాను ఒక్కో సినిమాకు రూ.40వేల నుంచి రూ.80వేల వరకు చెల్లింపులు జరిగాయి. కిరణ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో కమీషన్ వచ్చేది.
ఇదిలాఉంటే టాలీవుడ్‌లో ఏడాదిన్నర కాలంలో దాదాపు 40 పెద్ద సినిమాలను హెచ్‌డీ ప్రింట్ రూపంలో పైరసీ చేసి విక్రయించినట్లు గుర్తించారు. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేసి విక్రయించినట్లు కిరణ్ కుమార్ అంగీకరించాడని.. అతడిపై 1957 కాపీ రైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ లతో పాటు పలు సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా.. ఇటీవల వచ్చిన సింగిల్ సినిమాతో పాటు కన్నప్ప, పెళ్లికాని ప్రసాద్, గేమ్ చేంజర్, రాజధాని వంటి సినిమాల పైరసీ వీడియో ఫైల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. కిరణ్ కుమార్ పైరసీతో రూ.3,700 కోట్ల నష్టం వాటిళ్లిందని టీఎఫ్ సీసీ ఫిర్యాదులో పేర్కొంది. ఫిలిం ఛాంబర్‌లోని యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి యర్ర మణీంద్ర బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.