Chiranjeevi: టాలీవుడ్ పిల్లర్స్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లో.. అసలైన పండగ అంటే ఇదే

ABN , Publish Date - Oct 20 , 2025 | 07:41 PM

టాలీవుడ్.. వసుధైక కుటుంబం. ఈ విషయం అందరికీ తెలుసు. సినిమాల విషయంలో పోటీ ఉంటుంది తప్ప.. ఎప్పుడు.. ఎవరు పర్సనల్ గా నేను ఎక్కువ నేను తక్కువ అనుకున్న దాఖలాలు లేవు.

Chiranjeevi

Chiranjeevi: టాలీవుడ్.. వసుధైక కుటుంబం. ఈ విషయం అందరికీ తెలుసు. సినిమాల విషయంలో పోటీ ఉంటుంది తప్ప.. ఎప్పుడు.. ఎవరు పర్సనల్ గా నేను ఎక్కువ నేను తక్కువ అనుకున్న దాఖలాలు లేవు. టాలీవుడ్ మొత్తాన్ని నాలుగు కుటుంబాలు నడిపిస్తున్నాయి అని అనుకున్నా కూడా అందరూ ఒకే తాటిపై ఉన్నారు అనేది వాస్తవం. టాలీవుడ్ నాలుగు స్థంబాలు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. ఎంతమంది కుర్ర హీరోలు వచ్చినా.. వీరి నలుగురు మధ్య ఉన్న బాండింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.

ఒకప్పుడు వీరు ఎప్పుడు కలిసే కనిపించేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైంది.. ట్రోల్స్, విమర్శలు, వివాదాలు. అందుకే చాలా రేర్ గా ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. కానీ, ఈ దీపావళీ మాత్రం చాలా అంటే చాలా స్పెషల్. ఇద్దరు స్టార్స్ కాదు.. ముగ్గురు స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున.. ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.

మెగాస్టార్ చిరంజీవి.. తన స్నేహితులను ఇంటికి పిలిచి దీపావళీ సంబరాలను జరుపుకున్నారు. వీరితో పాటు అందాల భామ నయనతార కూడా ఈ సెలబ్రేషన్స్ లో జాయిన్ అయ్యింది. ఈ ముగ్గురు హీరోలతో అమ్మడు నటించడం విశేషం. ఇక ఈ ఫోటోలను చిరు అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

'నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్ మరియు నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి మరియు జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు మరియు ఐక్యతను గుర్తు చేస్తాయి.' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ముగ్గురు హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు అసలైన పండగ అంటే ఇది అని, పిక్ ఆఫ్ ది డే అని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Oct 20 , 2025 | 08:26 PM