Tollywood: సినిమాటోగ్రఫీ మంత్రితో నిర్మాతల భేటీ.. తదుపరి మంత్రి ఏమన్నారంటే..

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:16 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు, కార్మికుల సమ్మె, వేతనాల పెంపు వివిధ అంశాలపై చర్చించడానికి టీటౌన్‌ అగ్ర నిర్మాతలు (Tollywood Producers) ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ను (Kandula Durgesh) కలిశారు.

Tollywood Producers - Kandula Durgesh

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు, కార్మికుల సమ్మె, వేతనాల పెంపు వివిధ అంశాలపై చర్చించడానికి టీటౌన్‌ అగ్ర నిర్మాతలు (Tollywood Producers) ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ను (Kandula Durgesh) కలిశారు. అమరావతిలోని ఆయన కార్యాలయంలో భేటీ అయిన నిర్మాతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు9Chandrababu naidu), ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) అపాయింట్‌మెంట్‌ కావాలని మంత్రి దుర్గేశ్‌ను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. నిర్మాతలతో సమావేశమైన అనంతరం మంత్రి మాట్లాడుతూ..



‘కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో నెలకొన్న పరిణామాల గురించి వివరించడానికి నిర్మాతలు వస్తామన్నారు. ఆ మేరకు  ఈ రోజు కలిశారు. దీనిలో ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురూ చెప్పే విషయాలు వింటాం. ఈ అంశంపై ఫెడరేషన్‌, ఫిల్మ్‌ చాంబర్‌ సామరస్యంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తాం.  ప్రభుత్వ జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఆంధ్రాలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి  కట్టుబడి ఉన్నాం. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్‌ థియేటర్లు, డబ్బింగ్‌ థియేటర్లు పెట్టుకోవాలని ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వం తరఫున సాయం అందిస్తాం’ అని అన్నారు. 

Updated Date - Aug 11 , 2025 | 04:23 PM