Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
ABN, Publish Date - Jan 20 , 2025 | 12:47 PM
Tollywood: ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇటీవలే ఓ షూటింగ్ లో గాయపడిన నటుడు, ఫైట్ మాస్టర్ విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు.
ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇటీవలే ఓ షూటింగ్ లో గాయపడిన నటుడు, ఫైట్ మాస్టర్ విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటు తో మరణించారు. ఆయన వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసిందే. ఆయనని ట్రీట్మెంట్ కోసం చెన్నైకి తరలించగా ఆయన సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఆయనకీ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎక్కువగా విలన్ , సహాయ పాత్రలు పోషించిన ఆయన బాలకృష్ణ 'భైరవ ద్వీపం' చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. గోపీచంద్ యజ్ఞం సినిమాతో మంచి గుర్తింపు పొందారు. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది.