Naga Chaitanya: తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో.. నాగచైతన్య, శోభిత దంప‌తులు

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:07 PM

గురువారం ఉదయం హీరో నాగచైతన్య తన శ్రీమ‌తి శోభితతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

Naga Chaitanya

తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ ప్రముఖులు తరచూ ద‌ర్శించుకోవ‌డం తెలిసిన విష‌య‌మే. తాజాగా గురువారం ఉదయం హీరో నాగచైతన్య (Naga Chaitanya) తన శ్రీమ‌తి శోభిత (Shobhita Dhulipala)తో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి (Tirumala Balaji) వారిని దర్శించుకున్నారు. వీరి దర్శనానికి వచ్చిన సమాచారం తెలిసి అక్కడి భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

Naga Chaitanya

స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వేదపండితులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇటీవలే తండేల్ విజ‌యంతో మంచి జోష్‌లో ఉన్న నాగచైతన్య వరుస చిత్రాలను లైన్‌లో పెట్టాడు. అయితే సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, విదేశీ టూర్ల‌కు వెలుతున్నారు. ఈక్ర‌మంలోనే శోభితతో కలిసి చైత‌న్య స్వామి వారి దర్శనానికి రాగా ఆ జంట‌ను చూసి భ‌క్తులు, అభిమానులు ముచ్చ‌ట ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

Updated Date - Aug 21 , 2025 | 12:25 PM