Thug Life Release Issue: థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌.. కోర్టులో విచారణ

ABN , Publish Date - Jun 14 , 2025 | 06:07 AM

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి. థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో...

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి. థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. కమల్‌ క్షమాపణ చెప్పకపోతే థగ్‌లైఫ్‌ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. దీన్ని ప్రశ్నిస్తూ, సినిమా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం విచారించింది. సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

బెంగళూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 14 , 2025 | 06:07 AM