Tollywood: థియేటర్లలో సందడి చేయబోతున్నవి ఇవే
ABN , Publish Date - May 08 , 2025 | 03:46 PM
ఈ వీకెండ్ లో రెండు రీ-రిలీజ్ లతో కలిసి మొత్తం పది సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
మే నెల ఫస్ట్ వీకెండ్ లో కేవలం మూడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. అందులో 'హిట్ -3' స్ట్రయిట్ తెలుగు సినిమా కాగా 'రెట్రో' తమిళ డబ్బింగ్ సినిమా. 'ద న్యూ అవెంజర్స్' మార్వెల్ సంస్థ నిర్మించిన ఆంగ్ల చిత్రం. అయితే ఈ వారాంతంలో విడుదల కాబోతున్న సినిమాలు ఏకంగా పది ఉన్నాయి. అందులో రెండు రీ-రిలీజ్ మూవీస్.
మే 9వ తేదీ, 10వ తేదీ శుక్ర, శనివారాల్లో మొత్తం పది సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇందులో 9న చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' (Jagadeka Veerudu - Athiloka Sundari) రీ-రిలీజ్ అవుతోంది. మూడున్నర దశాబ్దాల తర్వాత రాబోతున్న ఈ సినిమాను మేకర్స్ త్రీడీలో రిలీజ్ చేస్తున్నారు. అలానే మే 10న అల్లు అర్జున్ నటించిన 'దేశముదురు'ను రీ- రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా డబ్బింగ్ తో కలిసి ఎనిమిది సినిమాలు వస్తున్నాయి.
శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీవిష్ణు నటించిన 'హ్యాష్ ట్యాగ్ సింగిల్' (#Single). వినోదమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్ (Vennela Kishore) హీరో ఫ్రెండ్ గా కీలక పాత్ర పోషించాడు. 'నిను వీడని నీడను నేను' ఫేమ్ కార్తిక్ రాజు దీనికి దర్శకుడు. అల్లు అరవింద్ (Allu Aravind) ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించారు. కేతికా శర్మ (Kethika Sharma), ఇవానా (Ivaana) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ప్రొడ్యూస్ చేశారు. ఇదిలా ఉంటే... స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కూడా ఇప్పుడు నిర్మాతగా మారిపోయింది. ట్రా ల లా బ్యానర్ పేరు మీద 'శుభం' అనే సినిమాను నిర్మించింది. ఈ హారర్ కామెడీ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమా విజయంపై ఉన్న నమ్మకంతో రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్ షోను వేశారు. దాంతో పాజిటివ్ టాక్ మొదలైంది. 'శుభం' తప్పకుండా విజయం సాధిస్తుందనే ధీమాను సమంత వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశాడు. శుక్రవారం ఈ రెండు సినిమాలతో పాటు అజయ్, ఇంద్రజ కీలక పాత్రలు పోషించిన 'సీఎం పెళ్ళాం' (CM Pellam), నవీన్ చంద్ర నటించిన థ్రిల్లర్ మూవీ 'బ్లైండ్ స్పాట్', టెర్రరిజం నేపథ్యంలో రూపుదిద్దుకున్న '6 జర్నీ', శ్రద్థా శ్రీనాథ్ కీ-రోల్ ప్లే చేసిన 'కలియుగమ్' చిత్రాలు వస్తున్నాయి. అలానే జపనీస్ మూవీ 'అవర్ డైనోజర్ డైరీ' కూడా తెలుగులో డబ్ అవుతోంది. ఇక శనివారం అల్లు అర్జున్ 'దేశముదురు'తో పాటు 'మహాబలి' విడుదల కానుంది. రాశిపరంగా ఎక్కువే ఉన్నా... ఇందులో ఎన్ని సినిమాలు థియేటర్లకు ఆడియెన్స్ ను తీసుకొస్తాయో చూడాలి.
Also Read: Priya Anand: స్విమ్మింగ్ ఫూల్‌లో.. జలకాలాటలతో కవ్విస్తున్న శర్వానంద్ భామ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి