India Pakistan War: ఇండో పాక్ తొలి యుద్ధం.. నాడు ఎన్టీఆర్ స్పందన ఇది

ABN , Publish Date - May 09 , 2025 | 10:12 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తో యుద్దం సాగుతున్న క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి చాలా మంది సెల‌బ్రిటీలు ముందుకు వ‌చ్చి త‌మ మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నారు.

ntr

పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తో యుద్దం సాగుతున్న క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి చాలా మంది సెల‌బ్రిటీలు ముందుకు వ‌చ్చి త‌మ మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నారు. ఈక్ర‌మంలో తాజాగా.. ఇండో పాక్ తొలి యుద్ధం 1965లో జరుగుతున్నప్పుడు ఆనాటి అగ్రనటుడు ఎన్టీఆర్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 17రోజుల పాటు 1965లో ఆగస్టు 5నుంచి సెప్టెంబర్ 22వరకు యుద్దం జరిగింది. అమెరికా జోక్యంతో తాష్కెంట్ ఒప్పందంతో ఆ యుద్దం ముగిసింది. ఆ యుద్ద సమయంలో ఎన్టీఆర్ దేశ రక్షణ నిధికి విరాళాలు సేకరించారు. ఇందుకోసం ఎన్టీ రామారావు విజ్ఞప్తి..జయం మనదే ! అంటూ ప్రజలకు రాసిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

మన భద్రత కోసం, దేశ గౌరవం కోసం దుష్ట శత్రువు నెదుర్కొని భీకర సంగ్రామంలో ప్రాణ త్యాగం చేస్తున్న సోదర భారత వీర సైనికుల సహాయార్ధం దేశ రక్షణ నిధి సేకరణకై నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రాల్లో ప్రదర్శనలీయ సంకల్పించాను..నా అభిమానులు ఆదరణ, యావదాంధ్ర ప్రజానీకం ఆశీస్సులు, మా పరిశ్రమ అండదండలు ఈ ప్రజాహిత కార్యాన్ని జయప్రదం చేయగలవని విశ్వాసం..గతానుభవమే..నన్నీ కార్యానికి పురికొల్పినవవని పేర్కొన్నారు. మాతృభూమి సంరక్షణకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని..జైహింద్ అంటూ ఎన్టీఆర్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

WhatsApp Image 2025-05-09 at 9.28.47 PM.jpeg

క‌ద‌లివ‌స్తున్న టాలీవుడ్‌..

ఇండియన్ ఆర్మీకి విరాళాల ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన తాజా చిత్రం సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా వ‌విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం త‌న రౌడీ వేర్ బ్రాండ్‌ నుంచి వ‌చ్చే లాభాల్లో కొంత ఆర్మీకి అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మా సపోర్ట్ మన సైనికులకు ఎప్పుడు ఉంటుందని.. భారత్ మాతాకీ జై అంటూ పేర్కొన్నారు.

Updated Date - May 09 , 2025 | 10:12 PM