New Year Movies: న్యూయర్ రోజున అడుగుపెడుతున్న అరడజను సినిమాలు...

ABN , Publish Date - Dec 31 , 2025 | 06:57 PM

సినిమా రంగం నయా జోష్ తో న్యూ ఇయర్ (New Year) లోకి అడుగు పెడుతోంది. అయితే... ఈ వీకెండ్ లో గతంలో వాయిదా పడిన సినిమాలు, రీ-రిలీజ్ మూవీస్ దే హవా అంతా! 'అఖండ 2 (Akhanda 2)' కారణంగా పోస్ట్ పోన్ అయిన సినిమాలు ఇప్పుడు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

New Year Movies

New Year Movies: సినిమా రంగం నయా జోష్ తో న్యూ ఇయర్ (New Year) లోకి అడుగు పెడుతోంది. అయితే... ఈ వీకెండ్ లో గతంలో వాయిదా పడిన సినిమాలు, రీ-రిలీజ్ మూవీస్ దే హవా అంతా! 'అఖండ 2 (Akhanda 2)' కారణంగా పోస్ట్ పోన్ అయిన సినిమాలు ఇప్పుడు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

డిసెంబర్ మాసంలో విడుదల కావాల్సిన చాలా చిన్న సినిమాలు రకరకాల కారణాలతో వాయిదా పడ్డాయి. అవన్నీ జనవరి 1న ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున నందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్ధ' తో పాటే విలన్ గా నటించిన 'వనవీర' కూడా వస్తోంది. ఆ మధ్య 'వనవీర' మూవీ మేకర్స్ 'తమ చిత్రాన్ని నందు ప్రమోట్ చేయడంలేద'ని పరోక్షంగా విమర్శించారు. అయితే ఇప్పుడు వారి మధ్య ప్యాచప్ జరిగిపోయింది. విడుదలైన వెంటనే 'సైక్ సిద్ధార్ధ'ను చూస్తానని 'వనవీర' హీరో కమ్ డైరెక్టర్ అవినాశ్ చెబితే, తాను 'వనవీర' చూస్తానని నందు తెలిపాడు. సరదాగా చేసిన ఈ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో విడుదల కావల్సిఉండి కాలేకపోయిన 'మదం, సఃకుటుంబానం', కన్నడ అనువాద చిత్రాలు '45', 'గత వైభవం' జనవరి 1న విడుదల అవుతున్నాయి.

బాలనటుడిగా పలు చిత్రాలలో నటించిన మహేంద్రన్ హీరోగా నటించిన సినిమా 'నీలకంఠ'. దాదాపు మూడేళ్ళ పాటు నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాను రాకేశ్‌ మాధవన్ డైరెక్ట్ చేశాడు. చాలా కాలం తర్వాత స్నేహా ఉల్లాల్ ఇందులో ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించడం విశేషం. శుక్రవారం ఈ సినిమా విడుదల అవుతోంది. దీనితో పాటే ఎప్పుడో విడుదల కావాల్సిన అమర గాయకుడు ఘంటసాల బయోపిక్ 'ఘంటసాల ది గ్రేట్' కూడా వస్తోంది. 'వినరా ఓ వేమ', 'ఓ అందాల రాక్షసి' సినిమాలు సైతం జనవరి 2న రిలీజ్ అవుతున్నాయి.

2025లో చాలానే సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. ఈ యేడాది చివరి రోజున కూడా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ కావడం విశేషం. అందులో ఒకటి పవన్ కళ్యాణ్‌ 'జల్సా' కాగా, మరొకటి మహేశ్ బాబు 'మురారి'. ఇదిలా ఉంటే... కొత్త సంవత్సరం మొదటి రోజున వెంకటేశ్ 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్ అవుతోంది. ఈ మూడు రీ-రిలీజ్ మూవీస్ మధ్య మంచి పోటీ ఏర్పడింది. ఇందులో 'నువ్వు నాకు నచ్చావ్'కు త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా, 'జల్సా' ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి బ్లాక్ బస్టర్ మూవీ! పెద్ద హీరోల సినిమాలేవీ ఈ వీకెండ్ లో లేకపోవడంతో ఇలా స్టార్స్ నటించిన పాత సినిమాలే మళ్ళీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

Updated Date - Dec 31 , 2025 | 06:57 PM