Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2024.. విజేతలు వీరే
ABN , Publish Date - May 29 , 2025 | 10:44 AM
2024 గద్దర్ అవార్డులను కిద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఇందులో నివేథా తామస్ 35 చిత్రానికి ఈవార్డుల పంట సండింది. దీంతో పాటు కల్కి, పొట్టేల్, రాజు యాదవ్, లక్కీ భాస్కర్ చిత్రాలు అవార్డులను దక్కించుకున్నాయి.
2024 గద్దర్ అవార్డులను కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. పుష్ఫ2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ కథానాయకుడిగా, 35 చిన్న కథ కాదు సినిమాకు గాను నివేధా థామస్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక ప్రథమ ఉత్తమ చిత్రంగా కల్కి, రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికయ్యాయి. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి), ఉత్తమ సహాయ నటులుగా ఎస్జే సూర్య, శరణ్య ప్రదీప్, ఉత్తమ కమెడియన్లుగా వెన్నెల కిశోర్, సత్య సెలక్ట్ అయ్యారు. జ్యూరీ విభాగంలో దుల్కర్ సల్మాన్, అనన్య నాగళ్ల ఎంపికయ్యారు.
ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు, ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్ (పుష్ప2), ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య (దేవర), బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ - యదు వంశీ (కమిటీ కుర్రాళ్లు), స్పెషల్ జ్యూరీ విభాగంలో దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్), అనన్య నాగళ్ల ఎంపికయ్యారు.
జూన్ 14 న హైటెక్స్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు.