SSMB 29: రిలాక్స్ బాయ్స్.. మన టైటిల్ వారణాసి కాదట
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:23 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) - రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న SSMB29 కోసం ఇండస్ట్రీ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది.
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) - రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న SSMB29 కోసం ఇండస్ట్రీ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. రెండేళ్లుగా ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ ను జక్కన్న అధికారికంగా ప్రకటించింది లేదు. అప్పుడప్పుడు షూటింగ్ అక్కడ చేస్తున్నాం.. ఇక్కడ చేస్తున్నామన్నమాట తప్ప ఇంకొకటి లేదు. ఇక లీకుల వీడియోల్లో మహేష్ లుక్ ను చూసుకొని మురిసిపోతున్నారు అభిమానులు.
ఇక ఇంకోపక్క ఈ సినిమా మొదలైనప్పటి నుంచి టైటిల్ గురించి పెద్ద చర్చలే జరుగుతూ వచ్చాయి. కొన్నిరోజుల వరకు గరుడ అని చెప్పుకొచ్చారు. అందులో వాస్తవం లేదు అని తెలియడంతో కొత్తగా వారణాసి అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. దీంతో వారణాసి టైటిల్ తో మహేష్ బాబును పక్కన పెట్టి ఎడిట్స్ చేస్తూ వచ్చారు.
గతరాత్రి మహేష్ , రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ మధ్య జరిగిన ట్విట్టర్ వార్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెల్సిందే. ఇక ఈరోజు ఎలాగైనా SSMB29 అప్డేట్ ఉంటుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసారు. కచ్చితంగా వారణాసి టైటిల్ ను రివీల్ చేస్తారని అనుకున్నారు. అయితే నవంబర్ 15 న గ్లోబ్ ట్రోటర్ అనే పేరుతో ఒక ఈవెంట్ ప్లాన్ చేసి అక్కడే టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు తెలిపారు.
ఇక ఎప్పుడు వచ్చినా అదే వారణాసి టైటిలే కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మహేష్ - రాజమౌళి సినిమాకు వారణాసి టైటిల్ కాదట. తాజాగా ఒక చిన్న సినిమా ఈ టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇదెక్కడి ట్విస్ట్ రా మావా అని షాక్ అవ్వడం మహేష్ ఫ్యాన్స్ వంతు అయ్యింది. ఇకపోతే ఈ పోస్టర్ రిలీజ్ తో వారణాసి టైటిల్ జక్కన్న రిజిస్టర్ చేయించలేదని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ వార్త తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ రిలాక్స్ బాయ్స్.. మన టైటిల్ వారణాసి కాదట అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ గ్లోబల్ సినిమాకు ఎలాంటి టైటిల్ ను పెడతారో చూడాలి.