Pooja Hegde: పూజా పాపను కాపాడే నాథుడే లేడా..
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:29 PM
ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు గోల్డెన్ లెగ్ అవుతారో.. ఎవరు ఎప్పుడు ఐరెన్ లెగ్ అవుతారో అనేది చెప్పడం ఎవరి వలన కాదు.
Pooja Hegde: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు గోల్డెన్ లెగ్ అవుతారో.. ఎవరు ఎప్పుడు ఐరెన్ లెగ్ అవుతారో అనేది చెప్పడం ఎవరి వలన కాదు. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకున్నవారే.. ఆ తరువాత ఐరెన్ లెగ్ అనిపించుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పూజా హెగ్డే (Pooja Hegde) పరిస్థితి అలానే ఉంది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ చిన్నది.. ఇప్పుడు ఒక్క సినిమా లేక అల్లాడిపోతోంది. మాస్క్ అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది పూజా. ఆ తరువాత ఒక లైలా కోసం అంటూ నాగచైతన్యతో జత కట్టింది.
దువ్వాడ జగన్నాథం సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఆ సినిమా ఎలాంటి విజయం అందుకుంది అనేది పక్కనపెడితే పూజా అందానికి ఇండస్ట్రీనే ఫిదా అయ్యింది. ఆ తరువాత నుంచి ఈ ముద్దుగుమ్మ ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వడం మొదలుపెట్టింది. అలా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరకు మాత్రమే. ఆ తరువాత సడెన్ ఆమె డౌన్ ఫాల్ మొదలయ్యింది. పాన్ ఇండియా సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు.. తెలుగు నుంచి హిందీ వరకు అమ్మడు ఏది ముట్టుకుంటే అది ప్లాప్ అవుతూ వచ్చాయి.
అరడజనుకు పైగా సినిమాల్లో పూజా నటించింది. ఏ ఒక్కటి ఆమెను మళ్లీ బౌన్స్ బ్యాక్ చేయించలేకపోయాయి. చివరికీ కూలీ కూడా. మోనికా సాంగ్ తో పూజా మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది అనుకున్నారు. అందుకు తగ్గట్టే చిన్నది పావులు కూడా కదిపింది. అందులో భాగంగానే దుల్కర్ సల్మాన్ సరసన నటించే ఒక లక్కీ ఛాన్స్ పట్టేసింది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో దుల్కర్ హీరోగా రవి నేలకుడితి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు పూజా సైన్ చేసినట్లు తెలిపింది. గుంటూరు కారం నుంచి తప్పుకున్నాకా పూజా తెలుగులో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఓకే చెప్పలేదు. దీంతో దుల్కర్ సినిమాపై అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది.
అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ సినిమా నుంచి కూడా పూజా తప్పుకుందని టాక్. ఆమె తప్పుకోలేదు.. వారే తీసేశారని ఇండస్ట్రీ వర్గాల గుసగుస. పూజా ప్లేస్ లో శృతి హాసన్ ను అనుకుంటున్నారని, త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించనున్నారని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే పూజా బ్యాడ్ లక్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టే. ఈ రేంజ్ గా ప్లాపుల్లో కూరుకుపోయిన పూజా పాపను పైకి లాగే నాథుడు ఎవరు అని అటు ఇండస్ట్రీ.. ఇటు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది అనేది తెలియాలి.
TejaSajjaPMF2: మొదటిదే రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే రెండో సినిమానా
Sunday Tv Movies: ఆదివారం, ఆగస్టు 24.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే