Thenela Vanala: వీడియో సాంగ్.. మరి ఇంత రొమాంటిక్‌గా తీశారేంటి
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:28 PM
ప్రాచి తెహ్లాన్, నిఖిల్ జంటగా వచ్చిన ప్రైవేట్ మెలోడీ సాంగ్ ‘తేనెల వానలా’ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.
యూట్యూబ్‌లో ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల ట్రెండ్ వేగంగా పెరుగుతున్న వేళ, తాజాగా విడుదలైన ఒక రొమాంటిక్ మెలోడీ పాట ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 20న విడుదలైన ‘తేనెల వానలా’ (Tenela Vaanala song) అనే ఈ తెలుగు గీతం ప్రస్తుతం నెటిజన్లను బాగా అలరిస్తోంది. కార్వార్, గోవా పరిసరాల్లోని పచ్చని లోయలు, జలపాతాలు, సముద్రతీర అందాల మధ్య చిత్రీకరించిన విజువల్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రధానంగా.. ఈ వీడియోలో నటి ప్రాచి తెహ్లాన్ (Prachi Tehlan) మరింత గ్లామరస్‌గా, గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ముఖ్యంగా కుర్రకారుని విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘క్వీన్ ఆఫ్ ది కోర్ట్’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, భారత నెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఇప్పుడు నటిగా అంతకుమించిన టాలెంట్‌తో ఇక్కడా దూసుకుపోతోంది. మరోవైపు బిగ్ బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ (Nikhil Maliyakkal) అమెకు జోడీగా పాటకు అదనపు చార్మ్ తీసుకువచ్చాయి.
జీ మ్యూజిక్ ద్వారా విడుదలైన ‘తేనెల వానలా’ (Thenela Vanala) ప్రస్తుతం ఆ సంస్థ యూట్యూబ్ ఛానెల్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ (Charan Arjun) స్వయంగా సాహిత్యం అందించిన ఈ పాటను వీహ (Veeha) ఆలపించాడు. ఇదిలాఉంటే. ఈ వీడియో సాంగ్ ఔట్ అండ్ ఔడ్ ఫుల్ రోమాంటిక్ యాంగిల్‌లో సాగుతూ చూసే వారిని కవ్విస్తూ కుర్చీలో కూర్చోనీయకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. ఇందుకు ముఖ్య ఉదాహారణ పాట రిలీజ్ అయిన ఒక్క రోజులోనే 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.