Madham Trailer: చేతకానోడికి, మొగుడికి తేడా తెలుసా.. రా అండ్ రస్టిక్ గా మదం ట్రైలర్
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:27 PM
హర్ష (Harsha), అనూప్, ఇనయా సుల్తానా (Inaya Sulthana), లతా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మదం (Madham).
Madham Trailer: హర్ష (Harsha), అనూప్, ఇనయా సుల్తానా (Inaya Sulthana), లతా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మదం (Madham). వంశీ కృష్ణ మల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ సూర్యదేవర రవీంద్రనాధ్, రమేష్ బాబు కొయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మదం ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రా అండ రస్టిక్ గా ట్రైలర్ ఉండడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.
మదం సినిమా కథను ట్రైలర్ లో అంతగా చూపించలేదు. కానీ, అడివి తల్లి బిడ్డలకు.. పోలీసులకు మధ్య జరిగే యుద్ధంలా కనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం చాలా అంటే చాలా రస్టిక్ గా అనిపిస్తుంది. అంతా గొడవలు, బూతులు, కొన్ని కొన్ని రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. రమేష్ బాబు కొయ్య డైలాగ్స్ చాలా ఘాటుగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఇనయా సుల్తానా సీన్స్, డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. జనవరి 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.