Vishnu Vinyasam: శ్రీవిష్ణు.. ఈసారి కొత్త విన్యాసం చేయబోతున్నట్టున్నాడే

ABN , Publish Date - Dec 15 , 2025 | 06:32 PM

చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని మొదలుపెట్టి ప్రామిసింగ్ హీరోగా మారాడు శ్రీవిష్ణు (Sree Vishnu). కామెడీని నమ్ముకొని మంచి కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు.

Vishnu Vinyasam

Vishnu Vinyasam: చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని మొదలుపెట్టి ప్రామిసింగ్ హీరోగా మారాడు శ్రీవిష్ణు (Sree Vishnu). కామెడీని నమ్ముకొని మంచి కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఈసారి కూడా మరో కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్నాడు.

శ్రీవిష్ణు హీరోగా.. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక నటిస్తుండగా సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది.

ఇక తాజగా శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ ని మేకర్స్ రివీల్ చేశారు. విష్ణు విన్యాసం అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుపుతూ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఒక గాలి.. ఒక ధూళి,.. ఒక నరదిష్ఠి లేకుండా పది కాలాలు చల్లగా ఉండాలి అంటూ బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ వినిపిస్తుండగా శ్రీవిష్ణు బైక్ పై విన్యాసం చేస్తూ కనిపించాడు. జాతకులకు సంబంధించిన అన్ని వస్తువులను హైలైట్ చేసి చూపించడంతో ఈ కథ.. వాటితోనే ముడిపడినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరిలో విష్ణు విన్యాసం రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 15 , 2025 | 06:35 PM