The Rajasaab: రెబల్ సాబ్.. మొదటి సాంగ్ తో వచ్చేస్తున్నాడు

ABN , Publish Date - Nov 21 , 2025 | 01:16 PM

వచ్చే సంక్రాంతి సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ది రాజాసాబ్ (The Rajasaab) కోసం అయితే ఇంకా ఎక్కువ ఎదురుచూస్తున్నారు.

The rajasaab

The Rajasaab: వచ్చే సంక్రాంతి సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ది రాజాసాబ్ (The Rajasaab) కోసం అయితే ఇంకా ఎక్కువ ఎదురుచూస్తున్నారు. మారుతీ (Maruthi) దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రాజాసాబ్ రిలీజ్ కి ఇంకా పట్టుమని నెల కూడా లేదు. అయినా కూడా మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేయలేదు. దీంతో అభిమానులు మరోసారి ఈ సినిమా ఏమైనా వాయిదా పడుతుందా అని భయపడి ప్రమోషన్స్ మొదలుపెట్టమని మేకర్స్ ను అడగడం మొదలుపెట్టారు. ఇక అభిమానుల ఆందోళన గమనించిన మేకర్స్ ఎట్టకేలకు ది రాజాసాబ్ నుంచి మొదటి సింగిల్రిలీజ్ కి ముహూర్తం ఖరారు చేశారు.

తాజాగా రాజాసాబ్ మొదటి సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెబల్ సాబ్ అంటూ సాగే సాంగ్ ను నవంబర్ 23 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక పోస్టర్ లో డార్లింగ్ లుక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఇప్పటివరకు మాస్ లుక్ లో కనిపించిన డార్లింగ్ ఒక్కసారిగా ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. బ్యాక్ గ్రౌండ్ ని బట్టి ఇది జాతర సాంగ్ లా కనిపిస్తుంది. ఈ సాంగ్ కోసం చిత్రబృందం చాలా కష్టపడిందని టాక్. చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ డ్యాన్స్ చేయనున్నాడు. దీంతో అభిమానులందరూ ఈ సాంగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి రెబల్ సాబ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Nov 21 , 2025 | 01:18 PM