Prabhas: ‘ది రాజాసాబ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:20 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్నసినిమా ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab). సంక్రాంతికి కానుకగా జనవరి 9న (the raja saab release date) ప్రేక్షకుల ముందుకు రానుంది

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్నసినిమా ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab). సంక్రాంతికి కానుకగా జనవరి 9న (the raja saab release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు , అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబరు 27న హైదరాబాద్‌లో ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. వేదిక ఎక్కడ, ఇతర వివరాల కోసం కాస్త వేచి చూడండి' అని తెలిపింది.

హారర్‌ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్‌దత్‌ (Sanjay Dutt) కీలక పాత్రలో నటిస్తున్నారు.

Updated Date - Dec 26 , 2025 | 05:39 PM